Header Banner

వైసీపీ బాగోతం! అధికారంలో బెదిరింపులు.. బయటపడ్డాక బెయిల్ పిటీషన్లు!

  Sat Apr 26, 2025 15:29        Politics

విడదల రజని మరిది గోపిని వారంపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన వసూలు చేసిన డబ్బులు ఏయే మార్గాల్లో ఎవరెవరికి చేరాయో తేల్చడానికి కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇంకోవైపు.. జైలులో ఉన్న తనకు బెయిల్‌ మంజూరు చేయాలని గోపి కోర్టును కోరారు. ఆయన తరఫున న్యాయవాది మన్మథరావు పిటిషన్‌ వేశారు. రెండు పిటిషన్లపై విచారణను ఏసీబీ న్యాయస్థానం ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.

 

ఇది కూడా చదవండి: మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

అరెస్ట్‌ నుంచి విడదల రజినికి రక్షణ

విజిలెన్స్‌ తనిఖీ పేరుతో స్టోన్‌ క్రషర్‌ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని నమోదైన కేసులో మాజీ మంత్రి విడదల రజిని, ఆమె పీఏ రామకృష్ణకు అరెస్ట్‌ నుంచి హైకోర్టులో ఉపశమనం లభించింది. వీరిద్దరికి బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌ 35(3)(సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ)) కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని, కేసుకు సంబంధించిన విషయాలను బయట మాట్లాడవద్దని పిటిషనర్లకు షరతులు విధించింది. దర్యాప్తునకు ఆటంకం కలిగించవద్దని, సాక్షులను ప్రభావితం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. వారం రోజుల్లో నివాస వివరాలను అఫిడవిట్‌ రూపంలో దర్యాప్తు అధికారికి అందజేయాలని పేర్కొంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విడదల రజిని మరిది గోపిని పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపఽథ్యంలో ఆయన వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను నిరర్ధకమైనదిగా ప్రకటించింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్లను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు. విజిలెన్స్‌ తనిఖీ పేరుతో తనను బెదిరించి రూ.2.20కోట్లు అక్రమంగా వసూలు చేశారని పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలాజి స్టోన్‌ క్రషర్‌ మేనేజింగ్‌ పార్ట్నర్‌ నల్లపనేని చలపతిరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విడదల రజిని, మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

 

ఇది కూడా చదవండి: మీరు నీళ్లు ఆపేస్తే మేము మీ ఊపిరి ఆపేస్తాం! వైరల్ అవుతున్న వీడియో!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!

 

అర్ధరాత్రి భారత జవాన్లపై పాక్ కాల్పులు! కాశ్మీర్ ఎల్ఓసీ పొడవునా..

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ycpdrama #stonecrushercase #acbarrest #baildrama #corruptpolitics #ycpcrimefiles #gopiarrest